శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ ,రష్మిక మందన్న,నాగార్జున నటించిన సినిమా కుబేర.ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది.రిలీజ్ కు ముందు ట్రైలర్ ఈసినిమాకు కావాల్సిన బజ్ తీసుకొచ్చింది. ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.డబ్బు చుట్టూ తిరిగే కథతో శేఖర్ కమ్ముల ఈసారి తన స్టైల్ కు భిన్నంగా ఈసినిమాను తెరకెక్కించాడు.ఇక ఈసినిమా రన్ టైం ను తగ్గించేశారు.ఇంతకుముందు ఎండ్ టైటిల్స్ తో కలిపి 3గంటల 15నిమిషాలు ఫిక్స్ చేయగా లెంగ్త్ మరి ఎక్కువైందని 14 నిమిషాలు ట్రిమ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమా కు యు/ఏ సర్టిఫికెట్ జారీచేయగా 181 నిమిషాల రన్ టైం తో థియేటర్లలోకి రానుంది.బుకింగ్స్ కూడా బాగానే అవుతున్నాయి హిట్ టాక్ వస్తే తొలి రోజు 15 కోట్లపైనే వసూళ్లను రాబట్టుకోనుంది.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా దాదాపు 100 కోట్లకుపైగా బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి,అమిగోస్ క్రియేషన్స్ ఈసినిమాను నిర్మించాయి.
ఇక గత కొన్ని నెలల నుండి సరైన సినిమాలు లేక టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోతోంది.బిగ్ హిట్ కొట్టడానికి కుబేరకు ఇదే మంచి ఛాన్స్.జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు ఈజీగా 100కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.దాదాపు సోలోగా విడుదలకానుండడం కూడా అడ్వాంటేజ్ కానుంది.మరి ఈసినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























