ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన కూలీ

Coolie's overseas theatrical rights sold for 81 crores

కోలీవుడ్ నుండి ఈఏడాది మచ్ అవైటెడ్ మూవీ గా వస్తుంది కూలీ.విక్రమ్ ,లియోలతో వరుస బ్లాక్ బస్టర్లు కొట్టి పీక్ ఫామ్ లో వున్న యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నుండి వస్తున్న సినిమాన కావడంతో కూలీ పై తమిళ్ తోపాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.సూపర్ స్టార్ రజినీకాంత్ ఇందులో హీరోగా నటించగా కింగ్ నాగార్జున ,ఉపేంద్ర పవర్ ఫుల్ రోల్స్ లో కనిపించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో సరికొత్త రికార్డు సృష్టించింది.దాదాపు 500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయనున్న మొదటి తమిళ సినిమాగా రికార్డు సృష్టించనుంది.అందులో భాగంగా ఓవర్సీస్ రైట్స్ రికార్డు ధరకి అమ్ముడయ్యాయి.దాదాపు 81 కోట్లకు ఈ డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం.కోలీవుడ్ లో ఇప్పటివరకు ఇదే హైయెస్ట్ ఓవర్సీస్ డీల్.ఇక మిగిలిన భాషల థియేట్రికల్ రైట్స్ కూడా భారీగా కోట్ చేస్తున్నారట నిర్మాతలు.తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం 40 కోట్లపైనే చెప్తున్నారు.ఈ రైట్స్ కోసం ప్రముఖ నిర్మాతలు పోటీ పడుతున్నారు.

ఓవరాల్ గా కూలీ రిలీజ్ కు ముందే బిజినెస్ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తుంది.ఇక రిలీజై హిట్ టాక్ వస్తే 1000 కోట్ల సినిమా అవుతుందని తమిళ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.లోకేష్ మార్క్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.తర్వలోనే ఫస్ట్ సింగిల్ రానుంది.ఆగస్టు 14న కూలీ థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.