ఇండియా మొత్తం వెతికితే ఒక్క అమ్మాయి దొరికింది – మైత్రి రవి

producer mythri ravi shankar talks about 8 vasantalu movie

మ్యాడ్ ఫేమ్ అనంతిక సునీల్‌కుమార్ లీడ్ రోల్ లో నటించిన సినిమా 8 వసంతాలు.మను ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు.ఈ శుక్రవారం విడుదల కానుంది.మైత్రి మూవీ మేకర్స్ నుండి వస్తున్న సినిమా కావడంతో 8 వసంతాలు పై అంచనాలు వున్నాయి.ఇక ప్రమోషన్స్ లో భాగంగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఇందులో నిర్మాత

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రవిశంకర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.ఈ సినిమాకి అనంతిక, ఫణి బిగ్గెస్ట్ పిల్లర్స్.రవి, హను కుడా ఎక్స్ట్రార్డినరీగా నటించారు.విజువల్ గా అదిరిపోయింది.చాలా ఎమోషనల్ కంటెంట్ చెప్పాడు ఫణి.ఈప్రయత్నం డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని అందరం ఆశిస్తున్నాను ఈసినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.చాలామంది కొత్తవాళ్లు ఉన్నారు.వాళ్ళందరికీ బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి అని కోరుకుంటున్నాను.

అనంతిక ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది.క్లాసికల్ డాన్స్ మార్సల్ట్స్ రెండు వచ్చిన అమ్మాయి కావాలని ఇండియా మొత్తం వెతికితే ఒక్క అమ్మాయి దొరికింది..తనే అనంతిక.ఈ సినిమా ఒక అమ్మాయి జర్నీ. ఒక అమ్మాయి జీవితమే 8 వసంతాలు. సినిమా కాశ్మీర్, ఊటీ, వారణాసి, ఆగ్రా ఇలా బ్యూటిఫుల్ లొకేషన్స్ లో తీయడం జరిగింది.జూన్ 20న మీ ముందుకు వస్తోంది. మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం అని అన్నారు.

అలాగే మరో నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇది చాలా డిఫరెంట్ మూవీ.కథ బాగా నచ్చి మేము చేసిన ప్రయత్నం.అందరికీ నచ్చుతుందని నమ్మకం వుంది. చాలా కొత్త టాలెంట్ ఇందులో వర్క్ చేశారు.వాళ్ళందరి కోసం ఈ పెద్ద విజయం సాధించాలి.అందరూ థియేటర్స్ లో సినిమా చూడాలని కోరుతున్నానని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.