కూలీ ఫస్ట్ సింగిల్ రానుంది

coolie first single to release on this week

సూపర్ స్టార్ రజినీకాంత్ – యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ.ఇప్పటివరకు గ్లింప్స్ తప్పించి పెద్దగా ఏమి బయటికి రాలేదు.అయినా ఈసినిమా కావాల్సినంత బజ్ వచ్చింది.దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ లెవెల్లో జరుగుతుంది.తెలుగు రైట్స్ కి 40 కోట్లపైనే చెప్తున్నారట.అలాగే ఓవర్సీస్ రైట్స్ కూడా రికార్డు ధరకి అమ్ముడుకానున్నాయి.ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రానుంది.ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రోమో షూట్ కూడా చేసేశారు.ఇందులో రజినీ తోపాటు అనిరుధ్ కూడా కనిపించనున్నాడట.అనిరుధ్ పాడిన ఈ ఎనర్జిటిక్ సాంగ్ ను ఈ వారం లో రిలీజ్ చేయనున్నారు.లోకేష్ మార్క్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో కింగ్ నాగార్జున , ఉపేంద్ర ,సత్య రాజ్,శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు.

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా కూలీలో మెరవనున్నాడు.దాదాపు 8 నిమిషాలు అమీర్ ఇందులో కనిపించనున్నాడట.భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా ఆగస్టు 14న రిలీజ్ కానుంది.అయితే అదే రోజున హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ ల వార్ 2 కూడా థియేటర్లలోకి వస్తుండడంతో తెలుగు, హిందీలో కూలీకి భారీ పోటీ ఎదురుకానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.