పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ‘8 వసంతాలు’ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతోంది. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. అనంతిక సనీల్ కుమార్ లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన 8 వసంతాలు సోల్‌ఫుల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ.. “మైత్రీ మూవీ మేకర్స్ 100 కోట్లు సినిమా చేసినా 10 కోట్ల బడ్జెట్ అయినా అంతే పాషన్‌తో సినిమా తీస్తారు. అంత పెద్ద బ్యానర్ 8 వసంతాలు లాంటి యూనిక్ కథలకి ప్లాట్‌ఫామ్ అవడం అనేది ఆనందంగా ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అనిపిస్తుంది. హేషం చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్టర్ గారు చాలా పాషన్‌తో ఈ సినిమా తీశారు అని అర్థమవుతుంది. ఆడియన్స్ కూడా ఆ పాషన్ ఫీల్ అవుతారు. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్” అని అన్నారు.
అలాగే మరో లేడీ డైరెక్టర్ నీరజ కోన మాట్లాడుతూ.. “మైత్రి మూవీ మేకర్స్‌కి థాంక్యూ. ఈ వేడుకలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది. కంటెంట్ చాలా క్యూరియాసిటీ పెంచుతోంది. డైరెక్టర్ ఫణి గారు చాలా పాషన్‌తో సినిమా తీస్తారు. ఈ సినిమా కోసం నేను చాలా ఎదురుచూస్తున్నాను. టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: