గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ ‘అఖండ 2: తాండవం’ కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. ఇటీవలే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కు నేషనల్ వైడ్ గా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ తో టీజర్ అదరగొట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రతిష్టాత్మకమైన 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. ఇటివలే జార్జియాలోని గ్రాండ్ లోకేషన్స్ లో కీలకమైన యాక్షన్ సీన్స్ ని షూట్ చేశారు. ఈ పార్ట్ అద్భుతంగా వచ్చిందని యూనిట్ వర్గాలు తెలిపాయి.
ఈ నేపథ్యంలో నేటి నుంచి అఖండ 2 కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఆర్‌ఎఫ్‌సీలో జరుగనున్న ఈ షెడ్యూల్ లో హీరో బాలకృష్ణతో పాటు యూనిట్ అంతా పాల్గొంటున్నారు. సినిమాలోని చాలా కీలకమైన సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. దీనితో చాలావరకు టాకీ పార్ట్ కంప్లీట్ కానుంది.
టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా.. డైనమిక్ ఆది పినిశెట్టి ఇంటెన్స్ పాత్రని పోషిస్తున్నారు. అలాగే టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. సంగీత సంచలనం S థమన్ సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ C రాంప్రసాద్ డీవోపీగా, తమ్మిరాజు ఎడిటర్‌గా. AS ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
ఇక ఈ హై-ఆక్టేన్ సీక్వెల్ కథ, స్కేల్, నిర్మాణం, సాంకేతిక నైపుణ్యం.. ప్రతి అంశంలో అఖండను మించి ఉంటుదని హామీ ఇస్తోంది. దసరా కానుకగా సెప్టెంబర్ 25న అఖండ 2 పాన్ ఇండియా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: