తెలంగాణ ఏర్పడ్డాక మొదటి సారి నిర్వహించిన ప్రతిష్ఠాత్మక తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.శనివారం హైటెక్స్ లో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.ఈ ఈవెంట్ కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ,సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అలాగే ప్రముఖ నిర్మాత ,ఎఫ్ డి సి చైర్మన్ ,దిల్ రాజు, బాలకృష్ణ ,అల్లు అర్జున్,విజయ్ దేవరకొండ తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు.విజేతలకు అవార్డుతోపాటు నగదు పురస్కారం ,ప్రశంసాపత్రం అందచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈవెంట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతూ …దాదాపుగా 14 సంవత్సరాల తరువాత ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రముఖ నిర్మాత , మిత్రుడు దిల్ రాజు గారు ఈ ప్రతిపాదనను నా దగ్గరికి తీసుకురావడం జరిగింది.కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమను ఎప్పుడు గౌరవించి మీకు అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా మిమ్మల్ని అభినందించాలన్న ఆలోచన తోని 60 సంత్సరాల క్రితం 1964లో తెలుగు సినీ పరిశ్రమను గుర్తించడానికి డైరెక్టర్లను,నటులను ,ఇతర కళాకారులను గుర్తించాలి వారికి అవార్డులను ఇవ్వాలని వాటికీ నంది పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించి ఇస్తూ వచ్చింది.అదేవిధంగా వివిధ కారణాల చేత 14 సంవత్సరాల క్రితం ఆగిపోయిన ఈ కార్యక్రమాన్ని మళ్ళీ నిర్వహించలన్న ఆలోచనతోని మా ప్రభుత్వం నంది అవార్డులను తెలంగాణ గద్దర్ అవార్డ్స్ పేరుతో తెలంగాణ ఏర్పడ్డాక ఈ 10 సంవత్సరాల్లో తీసిన సినిమాలకు అలాగే డైరెక్టర్లకు , సాంకేతిక నిపుణలకు ఈ రోజు ఈ అవార్డులను ఇవ్వడం ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. 14 ఏళ్ల తర్వాత ఈ రోజు తెలుగు సినిమా అవార్డ్స్ వేడుకను నిర్వహించుకోవడం శుభ పరిణామం.తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి జ్యూరీ ఎంపిక చేసిన చిత్రాలకు అవార్డ్స్ ఇవ్వడం సంతోషకరం.తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఈ రోజు ఇంత వైభవంగా నిర్వహించుకోవడానికి కారణమైన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నా ధన్యవాదాలని అన్నారు.
ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్న బాలకృష్ణ మాట్లాడుతూ…కళలకు చావు లేదు.తెలంగాణ ముద్దుబిడ్డ గద్దర్ అన్నపేరు ఎప్పటికీ నిలిచిపోయేలా ఆయన గౌరవార్థం పురస్కారం ఏర్పాటు చేసినందుకు తెలంగాణ గవర్నమెంట్‌కు కృతజ్ఞతలు.దళిత కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు గద్దర్.1996లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని మొదలుపెట్టారు.ఎంతో మంది ఈ గౌరవం పొందారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ పురస్కారం అందుకున్న తొలి వ్యక్తి కావడం నా అదృష్టమని అన్నారు.
పుష్ప 2 కి గాను ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్ మాట్లాడుతూ…ఈ ప్రతిష్ఠాత్మకమైన పురస్కారం అందుకున్నందుకు ఆనందంగా ఉంది. గద్దర్ సినీ పురస్కారాలు ఏర్పాటుకు చొరవ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు. ప్రతి ఏడాదీ ఈ వేడుక ఇలానే కొనసాగాలి. ఈ పురస్కారం నాకెంతో ప్రత్యేకం.పుష్ప2కిగానూ అందుకున్న తొలి పురస్కారం ఇదే. దర్శకుడు సుకుమార్ విజన్, తన ప్రేమే ఇందుకు కారణం దర్శకుడు రాజమౌళికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు.పుష్ప సినిమాని హిందీలో విడుదల చేయమని చెప్పకపోతే ఇంత ఆదరణ దక్కేది కాదు. ఈ పురస్కారాన్ని నా అభిమానులకి అంకితం చేస్తున్నాని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: