కుబేర నాకు చాలా స్పెషల్ ఫిలిం – నాగార్జున

Kuberaa is A Special Film For Me, Says King Nagarjuna

టాలీవుడ్ కింగ్ నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ శేఖర్ కమ్ముల ‘కుబేర’. అద్భుతమైన తారాగణంతో ‘కుబేర’ ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘పోయిరా మామ, ట్రాన్స్ ఆఫ్ కుబేర’ చార్ట్ బస్టర్ రెస్పాన్స్‌తో మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో వున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. కుబేర తెలుగు, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘పీ పీ డుమ్‌ డుమ్‌’ పాటని ముంబయిలో గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మీరందరూ చూపించే ప్రేమకి కృతజ్ఞతలు. శివ, క్రిమినల్..ఇలా నా కెరీర్ బిగినింగ్ నుంచి నా చిత్రాలకి ఇక్కడ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. నా డబ్బింగ్ చిత్రాలు కూడా ఇక్కడ చాలా అద్భుతంగా యాక్సెప్ట్ చేశారు. కుబేర నాకు చాలా స్పెషల్ ఫిలిం. ఏదైనా డిఫరెంట్ గా చేయాలి అనుకున్నప్పుడు శేఖర్ వచ్చారు.”

“ఆయనతో గత 15 ఏళ్లుగా పని చేయాలని అనుకుంటున్నాను. ఆయన ఈ సినిమా గురించి చెప్పినప్పుడు మరో ఆలోచన లేకుండా ఓకే చేశాను. శేఖర్ బ్రిలియంట్ ఫిలిం మేకర్. తన సెన్సిబిలిటీస్ అద్భుతంగా ఉంటాయి. తన మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. జిమ్ సర్బ్ తో కలిసి పనిచేయడం మంచి ఎక్స్పీరియన్స్. తెలుగు చాలా చక్కగా మాట్లాడారు.”

“రష్మిక సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. తను ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. డబ్బింగ్ చూసిన తర్వాత తనకు ఫోన్ చేసి అభినందించాను. ఇందులో తన పెర్ఫార్మన్స్ మిమ్మల్ని అలరిస్తుంది. దేవిశ్రీ నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా కోసం అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ ఇచ్చారు. తన సంగీతంతో సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లారు. ధనుష్ బ్రిలియంట్ యాక్టర్. ఈ సినిమాలో అద్భుతంగా చేశారు. తన ప్రతి సినిమాకి వైవిధ్యం చూపిస్తుంటారు. తనతో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. జూన్ 20న మీరందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయాలి” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.