కుబేర.. ఐ ఓపెనర్ లాంటి సినిమా – రష్మిక మందన్న

Kuberaa is an Eye Opener Film, Says Rashmika Mandanna

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ శేఖర్ కమ్ముల ‘కుబేర’. అద్భుతమైన తారాగణంతో ‘కుబేర’ ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘పోయిరా మామ, ట్రాన్స్ ఆఫ్ కుబేర’ చార్ట్ బస్టర్ రెస్పాన్స్‌తో మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో వున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. కుబేర తెలుగు, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘పీ పీ డుమ్‌ డుమ్‌’ పాటని ముంబయిలో గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా హీరోయిన్ రష్మిక మందన మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఒక నటిగా కుబేర సినిమా నాకు చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇది ఐ ఓపెనర్ లాంటి సినిమా. అన్నీ కూడా రియల్ లొకేషన్స్ లో షూట్ చేయడం జరిగింది. నాగార్జున సర్, ధనుష్‌ గారితో కలిసి నటించడం ఆనందంగా ఉంది.”

“శేఖర్ గారితో వర్క్ చేయడం మంచి ఎక్స్‌పీరియెన్స్‌. ఈ సినిమాలో మా పెర్ఫార్మన్స్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ మీ అందరిని సర్ప్రైజ్ చేస్తుంది. ఆడియన్స్ రియాక్షన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నా గత సినిమాల్లో పాత్రలు ‘గీతాంజలి, శ్రీవల్లి, మహారాణి యేసుబాయి’ లానే ‘కుబేర’లో ప్లే చేసిన రోల్‌ కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.