పెద్ది తరువాత రామ్ చరణ్ సుకుమార్ తో కాకుండా 

Ram charan may collaborate with Tivikram after Peddi

గేమ్ ఛేంజర్ రూపంలో దాదాపు మూడేళ్ళ టైం తీసుకున్నాడు రామ్ చరణ్.శంకర్ డైరెక్ట్ చేసిన ఈసినిమా ఈ సంక్రాంతికి వచ్చింది.ఈసినిమా ఇచ్చిన రిజల్ట్ తో  రామ్ చరణ్  నెక్స్ట్ సినిమాలను మాత్రం తొందరగా పూర్తి చేసి కనీసం ఏడాదికి ఒకటైనా రిలీజ్ ఉండేలా ఫిక్స్ అయ్యాడు.అందులో భాగంగా ప్రస్తుతం పెద్ది చేస్తున్నాడు.పెద్దగా విఎఫ్ఎక్స్ అవసరం లేకుండా రూరల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా ఇది.షూటింగ్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది.ఈనవంబర్ కల్లా ప్యాకప్ చెప్పనున్నారు.మార్చి 27న రిలీజ్ చేస్తామని ఇంతకుముందే ప్రకటించారు.ఆలెక్కనా టైం చాలా ఉండడంతో దాదాపు ఆ డేట్ కు రావడం ఖాయం. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా తరువాత రామ్ చరణ్ ,సుకుమార్ తో చేయనున్నాడని అనౌన్స్ మెంట్ వచ్చింది.సుకుమార్ ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు. అది ఇప్పుడప్పుడే అయ్యాలే కనిపించడం లేదు.అందుకే ఈ గ్యాప్ లో చరణ్ మరో సినిమా చేయాలనీ చూస్తున్నాడు.రీసెంట్ గా త్రివిక్రమ్, రామ్ చరణ్ ను కలిసి స్టోరీ వినిపించాడని వీళ్ళ కాంబో సెట్ అనే ప్రచారం జరుగుతుంది.అయితే త్రివిక్రమ్ నెక్స్ట్ అల్లు అర్జున్ తో చేయాల్సిఉండగా అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ తో సినిమా చేస్తున్నాడు. 

షూటింగ్ స్టార్ట్ కావడానికే చాలా రోజుల పట్టనుంది.ఆలెక్కన వచ్చే ఏడాది కూడా అల్లు అర్జున్ ఫుల్ బిజీ కానున్నాడు.దాంతో త్రివిక్రమ్ ఈ గ్యాప్ లో రెండు సినిమాలు చేయాలనుకుంటున్నాడట.అందులో ఓ సినిమాను రామ్ చరణ్ తో చేయాలని చూస్తున్నాడు.ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా పాన్ ఇండియా టెన్షన్ లేకుండా  తక్కువ రోజుల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడట.త్వరలోనే ఈసినిమా విషయంలో క్లారిటీ రానుంది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.