ప్రయోగాత్మక సినిమాలతో పొలిస్తే కమర్షియల్ సినిమాలకు ఆదరణఎక్కువగా ఉంటుంది. అంతేకాదు అవే ఎక్కువ వసూళ్లను కూడా రాబట్టుకుంటాయి. కానీ అవార్డుల విషయానికి వస్తే మాత్రం రివర్స్. ప్రయోగాత్మక సినిమాలను ఇందులో పెద్ద పీట వేస్తారు. కమర్షియల్ సినిమాలు ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకున్న సందర్భాలు తక్కువ. అయితే తెలంగాణ ప్రభుత్వం తాజాగా అందించిన ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్‌లో మాత్రం కమర్షియల్ సినిమాల హవా కొనసాగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
2014 నుండి 2024 వరకు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ (మొదటి ఉత్తమ, రెండవ ఉత్తమ, మూడవ ఉత్తమ) విభాగంలో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు చిత్రాలలోని నైపుణ్యాన్ని గుర్తించాలనే ఉద్దేశ్యాన్ని సూచించే చర్యలో భాగంగా జ్యూరీ, ప్రేక్షకులు మెచ్చిన పలు కమర్షియల్ సినిమాలను ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది.
ఇక జ్యూరీ గుర్తించిన అతిపెద్ద వాణిజ్య చిత్రాలలో స్టార్ హీరోలు నటించిన ‘రంగస్థలం, అల వైకుంఠపురములో, భగవంత్ కేసరి’ వంటి పక్కా కమర్షియల్ సినిమాలు ఉన్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించగా సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం, 2018 సంవత్సరానికి రెండవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డుకు ఎంపికయింది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురములో చిత్రం 2020 సంవత్సరానికి గానూ మొదటి ఉత్తమ చిత్రంగా నిలిచింది.
ఇక నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో అనిల్ రావిపూడి డైరెక్షన్ చేసిన మరో వాణిజ్య చిత్రం భగవంత్ కేసరి 2023కి గానూ మూడవ ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది. అలాగే బాలయ్య-బోయపాటి శ్రీను కాంబోలో వచ్చి సూపర్ హిట్ అందుకున్న ‘అఖండ’ 2021లో.. ఇంకా ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ 2016కి థర్డ్ బెస్ట్ ఫిల్మ్స్‌గా ఎంపికయ్యాయి. వీటితోపాటుగా 2014కి గానూ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, వీవీ వినాయక్ డైరెక్షన్‌లో వచ్చిన ‘అల్లుడు శ్రీను’ థర్డ్ బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచింది.
ఇవన్నీ గమనిస్తే, మారిన కాలానికి అనుగుణంగా TGFA కూడా సరికొత్త పంథాలో కొనసాగబోతున్నదనే నమ్మకాన్ని కలిగిస్తోంది ఈ అవార్డుల ద్వారా. ఇది కమర్షియల్ సినిమాలను నిర్మించే నిర్మాతలకు, దర్శకులకు, హీరోలకు దన్నుగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం మన మేకర్స్ కమర్షియల్ కథలలో మంచి మెసేజ్ లను, విలువలను కలగలిపి తీస్తుండటంతో ఇటు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా అవార్డులను సైతం అందుకుంటున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: