మెగా స్టార్ చిరంజీవి ,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మెగా 157(వర్కింగ్ టైటిల్).రీసెంట్ గానే ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో కంప్లీట్ కాగా నెక్స్ట్ షెడ్యూల్ ఈరోజు డెహ్రాడూన్ లో స్టార్ట్ అయ్యింది.ఇందులో ఇంటర్వెల్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.ఇందుకోసం చిరు నిన్ననే డెహ్రాడూన్ చేరుకోగా హీరోయిన్ నయనతార కూడా ఈషెడ్యూల్ లో జాయిన్ కానుంది.ఎలాంటి డిలే లేకుండా అనుకున్న ప్రకారం షూటింగ్ ను కంప్లీట్ చేస్తున్నారు.అనిల్ స్పీడ్ చూస్తుంటే అక్టోబర్ వరకు షూటింగ్ అంతా కంప్లీట్ చేసేలా వున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనిల్ రావిపూడి మార్క్ ఎంటరైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ ,గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల పై సాహు గారపాటి ,సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.సంక్రాంతికి వస్తున్నాం తరువాత అనిల్ నుండి వస్తున్న సినిమాకవడంతో మెగా 157పై భారీ అంచనాలు వున్నాయి.
ఇక ఈసినిమా కంటే ముందు చిరంజీవి, విశ్వంభరతో ప్రేక్షలముందుకు రానున్నాడు.సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో వశిష్ఠ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుంది. విఎఫ్ఎక్స్ పనులు పూర్తయితే రిలీజ్ డేట్ ప్రకటించాలని చూస్తున్నారు.భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ నిర్మిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























