మ్యాడ్ తో తెలుగులోకి బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది కేరళ బ్యూటీ అనంతిక సనీల్‌కుమార్.ఇక ఈసినిమా తరువాత అవంతిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా 8 వసంతాలు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా కావడంతో అంచనాలు వున్నాయి.మను ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.ఇప్పటికే రెండు టీజర్ లు రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమానుండి సెకండ్ సింగిల్ రానుంది.ఈనెల 11న ఈసాంగ్ రిలీజ్ కానుంది.పరిచయమిలా అంటూ సాగే ఈ సాంగ్ ను ప్రముఖ గాయని చిత్ర పాడగా వనమాలి సాహిత్యం అందించారు.బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా వస్తున్న ఈసినిమాలో హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ,సమీరా కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.హెషామ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.ఈనెల 20న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
అయితే ఈసినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదురుకానుంది.ఎందుకంటే అదే రోజు మచ్ అవైటెడ్ కుబేర కూడా విడుదలకానుంది.దాంతో 8 వసంతాలు ఎలాంటి రన్ ను కొనసాగిస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: