సూపర్ హిట్ ప్రాంచైజీ హౌస్ ఫుల్ నుండి లేటెస్ట్ గా వచ్చిన సీక్వెల్ హౌస్ ఫుల్ 5.గత శుక్రవారం ఈసినిమా రిలీజ్ అవ్వగా పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.మౌత్ టాక్ కూడా బాగుండడంతో రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది.మొదటి రోజు 24.35కోట్లు ,రెండో రోజు 32.38కోట్లు వసూళ్లను రాబట్టుకోగా మూడో ఏకంగా 35.10కోట్ల వసూళ్లతో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో దూసుకుపోతుంది.దేశ వ్యాప్తంగా చూస్తే మూడు రోజుల్లో 91.83కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది. ఈరోజు తో 100కోట్ల క్లబ్ లో చేరనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అటు ఓవర్సీస్ లోనూ ఈసినిమా అదరగొడుతుంది.మూడు రోజుల్లో 4మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టింది.అక్షయ్ కుమార్ కెరీర్ లో హైయెస్ట్ ఇవే ఓపెనింగ్స్.ఒక్క నార్త్ అమెరికాలోనే మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది.అక్షయ్ కుమార్ కు అక్కడ ఇది 28వ మిలియన్ డాలర్ సినిమా.ఇదే జోరు కొనసాగిస్తే ఈసినిమా ఫుల్ రన్ లో 400కోట్ల వరకు రాబట్టుకోనుంది.
అక్షయ్ కుమార్ ,అభిషేక్ బచ్చన్ ,రితేష్ దేశ్ ముఖ్ ,సంజయ్ దత్ , నర్గిస్ ఫక్రి , జాక్వలిన్ ఫెర్నాండేజ్ ,సోనమ్ బజ్వా ,నానా పాటేకర్ కీలక పాత్రల్లో నటించిన ఈసినిమాను తరుణ్ మన్సుఖాని డైరెక్ట్ చేయగా సాజిద్ నడియాద్వాలా నిర్మించాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: