యంగ్ హీరో విజయ్ దేవరకొండ కింగ్డమ్ మే 30న రిలీజ్ కావాల్సివుండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.రీసెంట్ గానే న్యూ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. జులై 4న ఈసినిమా థియేటర్లలోకి రానుంది. అయితే ఈ డేట్ కి కూడా రావడం లేదని నిన్నటి నుండి వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు ఈనెల 12న విడుదలకావల్సివుండగా సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడేలా వుంది.ఒకవేళ వాయిదా పడితే జూలై 4 న రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని దాంతో కింగ్డమ్ వెనక్కి వెళ్ళిపోనుందని ప్రచారం జరుగుతుంది. అయితే అలాంటి దేమి లేదని జూలై 3న యూఎస్ ప్రీమియర్స్ పడనున్నాయని డిస్ట్రిబ్యూషన్ సంస్థ క్లారిటీ ఇచ్చింది. దాంతో ఇప్పటికైతే ఎలాంటి వాయిదా లేనట్లే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈసినిమాను తెరకెక్కిస్తుండగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.పాన్ ఇండియా రిలీజ్ కానున్న ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.
ఇక విజయ్ ప్రస్తుతం మరో రెండు సినిమాలకు ఓకే చెప్పాడు .అందులో ఓ సినిమాను రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా తో చేయనున్నాడు.దిల్ రాజు ఈసినిమాను నిర్మించనున్నారు.అలాగే టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ తో ఓ కూడా విజయ్ సినిమా చేయనున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఈ రెండు సినిమాల్లో రాహుల్ సంకృత్యాన్ తో చేయనున్న సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























