ఓజీ షూటింగ్ అప్డేట్

OG final schedule shoot starts tomorrow

మచ్ అవైటెడ్ ఓజీ తుది దశకు చేరుకుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమా రెండేళ్ల క్రితం సెట్స్ పైకి వెళ్లగా ఎట్టకేలకు ఇప్పుడు పూర్తికావొచ్చింది.పవన్ పొలిటికల్ బిజీ వల్ల షూటింగ్ కి లాంగ్ బ్రేక్ పడగా గత నెలలో మళ్ళీ స్టార్ట్ అయ్యింది.రీసెంట్ గానే హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ కంప్లీట్  కాగా నిన్నటితో ముంబై షెడ్యూల్ పూర్తయింది.ఇక నెక్స్ట్ షెడ్యూల్ రేపటి నుండి విజయవాడ లో స్టార్ట్ కానుంది.ఇందులో మొదటి రోజు నుండే పవన్ జాయిన్ కానున్నాడు.ఈషెడ్యూల్ తో షూటింగ్ కంప్లీట్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పెద్దగా విఎఫ్ఎక్స్ వర్క్ కూడా లేకపోవడంతో చెప్పిన తేదీకే రిలీజ్ కానుంది.గ్యాంగ్ స్టర్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రియాంక మోహన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీయ రెడ్డి ,అర్జున్ దాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.సెప్టెంబర్ 25న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఇక ఓజీ ముగింపు దశకు చేరుకోవడంతో పవన్ నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ కి కూడా డేట్స్ ఇచ్చాడు.జూన్ రెండో వారంలో ఈసినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.హరీష్ శంకర్ తెరకెక్కిస్తుండగా శ్రీ లీల ఓ హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటివరకు 20శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఈఏడాది షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ చేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.