రీసెంట్ గా కన్నప్ప హార్డ్ డ్రైవ్ మిస్సింగ్ హాట్ టాపిక్ అయ్యింది.కన్నప్ప కు సంబంధించిన 90 నిమిషాల ఫుటేజ్ ని హార్డ్ డ్రైవ్ లోపెట్టి ముంబైకి చెందిన ఓ విఎఫ్ఎక్స్ సంస్థ కొరియర్ ద్వారా హైదరాబాద్ లోని మోహన్ బాబు ఆఫీస్ కి పంపించగా ఆఫీస్ బాయ్ ,అలాగే చరిత అనే ఉద్యోగిని ఆ హార్డ్ డిస్క్ ను తీసుకొని పరారయ్యారు.దాంతో నిర్మాతలు పోలీసులను ఆశ్రయించారు.అయితే దీనిపై అనేక సందేహాలు తలెత్తాయి. అంత పెద్ద సినిమా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కొరియర్ లో పంపించడం అది మిస్ అవ్వడం ఏంటని పెద్ద చర్చే నడించింది.ఇక దీని గురించి కన్నప్ప నిర్మాత హీరో మంచు విష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూ లో స్పందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అసలేం జరిగిందంటే కన్నప్ప విఎఫ్ఎక్స్ వర్క్ 8 కంపెనీలకు ఇచ్చాం. ఇందులో ముంబై కి చెందిన సంస్థ విఎఫ్ఎక్స్ వర్క్ చేసి ఆ కాపీని ఆన్లైన్ లో పంపించింది. అయితే సేఫ్ సైడ్ సెకండ్ కాపీని హార్డ్ డ్రైవ్ ద్వారా హైదరాబాద్ లోని నాన్న గారి కార్యాలయానికి పంపించింది.ఆ విషయాన్ని మాకు చెప్పలేదు.అక్కడ ఆఫీస్ బాయ్ , చరిత అనే ఉద్యోగిని ఆ హార్డ్ డ్రైవ్ తీసుకొని పారిపోయారు.అయితే వీరిద్దరూ మంచు మనోజ్ గారి మనుషులని తెలిసింది . ప్రస్తుతానికి పోలీసులు విచారణ చేస్తున్నారు.ఇంకా ఆ హార్డ్ డ్రైవ్ అయితే మా దగ్గరికి రాలేదు.పాస్ వర్డ్ ఉండడంతో హార్డ్ డ్రైవ్ 100శాతం సేఫ్ అని విష్ణు క్లారిటీ ఇచ్చాడు.
ఇక తన డ్రీం ప్రాజెక్ట్ కావడంతో కన్నప్పను తెగ ప్రమోట్ చేస్తున్నాడు విష్ణు. ముకేశ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో మోహన్ బాబు ,విష్ణు లతోపాటు ప్రభాస్ ,మోహన్ లాల్ ,అక్షయ్ కుమార్ ,కాజల్ కీలక పాత్రల్లో నటించారు.జూన్ 27న కన్నప్ప థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: