టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున అక్కినేని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. ఈ మేరకు ఆయన తన చిన్న కుమారుడు, హీరో అఖిల్ వివాహం త్వరలో జరుగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిని ఆహ్వానించేందుకు నేడు సీఎం నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా నాగార్జున సీఎం చంద్రబాబుకి వెడ్డింగ్ కార్డుని అందించి జూన్ 6న జరుగనున్న తన తనయుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు, అఖిల్‌కు ముందస్తు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా అఖిల్ పరిణయమాడనున్న అమ్మాయి పేరు జైనబ్. ఈమె ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్జీ కుమార్తె. గతేడాది నవంబర్ 26న వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జూన్ 6న వీరి వివాహం జరుగబోతోంది.
ఇక 1994లో ‘సిసింద్రీ’ చిత్రంతో బాలనటుడిగా వెండితెరపై కనిపించిన అఖిల్.. ఆ తర్వాత 2015లో వచ్చిన ‘అఖిల్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో ‘హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్’ వంటి చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ఆయన ‘లెనిన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. దీనికి కిశోర్ అబ్బూరు డైరెక్షన్ చేస్తుండగా.. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: