లెజండరీ డైరెక్టర్ మణిరత్నం ,సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా థగ్ లైఫ్.మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.ఇక అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సాలిడ్ గా వున్నాయి.ముఖ్యంగా తమిళనాడులో అదరగొడుతుంది.గత 24 గంటల్లో బుక్ మై షోలో 50 వేలకుపైగా టికెట్స్ తెగాయి.ఓవరాల్ గా ఇప్పటివరకు 12కోట్ల ప్రీ సేల్స్ అయ్యాయి.హిట్ టాక్ వస్తే థగ్ లైఫ్ మొదటి రోజు 30 నుండి 40కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈసినిమా కర్ణాటకలో విడుదలయ్యేలా కనిపించడం లేదు.రీసెంట్ గా కన్నడ భాష గురించి కమల్ చేసిన వ్యాఖ్యలు అక్కడి వారికి ఆగ్రహం తెప్పించాయి.దాంతో కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఈసినిమాను బ్యాన్ చేసింది.ఇక కమల్ హైకోర్టు ను ఆశ్రయించగా కోర్టు కూడా కమల్ ను క్షమాపణ చెప్పాలిసిందే అని సూచించింది.కమల్ అందుకు నిరాకరించడంతో ప్రస్తుతానికి అయితే థగ్ లైఫ్ కర్ణాటక లో విడుదలకావడం లేదు.
దాదాపు 300కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమాలో శింబు ,అశోక్ సెల్వన్ ,త్రిష ,ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా కమల్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మించింది.ఈసినిమా 2 గంటల 45 నిమిషాల రన్ రన్ టైంతో థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























