మెగా స్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మెగా 157(వర్కింగ్ టైటిల్).రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ కాగా అనుకున్నదానికంటే ఒక రోజు ముందుగానే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు.ఈరోజు వరకు ఈషెడ్యూల్ ప్లాన్ చేసినా నిన్నటి తోనే అనుకున్న చిత్రీకరణ పూర్తి కావడంతో ప్యాక్ అప్ చెప్పేశారు. అనిల్ రావిపూడి మేకింగ్ ఎలా ఉంటుందో ఇంతకుముందే చూశాం.బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం అయితే కేవలం 75 రోజుల్లోనే పూర్తి చేశాడు. ఇక ఈసినిమాను కూడా ఫాస్ట్ కంప్లీట్ చేయనున్నాడు.త్వరలోనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అవుట్ అండ్ అవుట్ ఎంటరైనర్ గా రానున్న ఈసినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ , గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల పై సాహు గారపాటి ,సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.ఇందులో వింటేజ్ చిరును చూపించనున్నాడు అనిల్ రావిపూడి.వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
ఇక ఈసినిమా కన్నా ముందు చిరంజీవి, విశ్వంభరతో ప్రేక్షలముందుకు రానున్నాడు.బింబిసార ఫేమ్ వశిష్ఠ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుంది.సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతుంది.షూటింగ్ కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ పనులు జరుపుకుంటుంది.ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం ఈసినిమాకు అందిస్తుండగా యువీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























