థగ్ లైఫ్.. మీ రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నా – కమల్ హాసన్

Kamal Haasan Thanks Telugu Audience at Thug Life Pre Release Event, Vizag

ఈ సంవత్సరం సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి ‘థగ్ లైఫ్’. యూనివర్సల్ కమల్ హాసన్ ప్రధానపాత్రలో, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్‌గా సెన్సేషన క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన ఈ సంస్థ ఇప్పుడు ‘థగ్ లైఫ్’ భారీగా విడుదల చేయబోతోంది. ఈ రోజు మేకర్స్ వైజాగ్‌లో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో కమల్ హాసన్ తెలుగు ప్రేక్షకులను ప్రశంసల్లో ముంచెత్తారు.

కమల్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “అందరికీ నమస్కారాలు. వైజాగ్ ప్రజలు నన్ను ఎంతగానో దగ్గరకి తీసుకున్నారు. 21 ఏళ్ల వయసులో ఇక్కడికి వచ్చాను. అప్పటికి నా మొహం కూడా ఎవరికి తెలీదు. షూటింగ్ చాలా సాఫీగా జరిగింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ కూడా నడవలేని ఫ్యాన్ బేస్‌ని ‘మరో చరిత్ర’ అనే చిత్రం ఇచ్చింది. తర్వాత ‘ఏక్ తుజే కేలియే’ సినిమా చేసినప్పుడు కూడా తెలుగు ప్రేక్షకులు మన కుర్రాడు హిందీకి వెళ్లి కొట్టాడురా అని అభినందించారు.”

“అలాంటి వైజాగ్‌లో ‘సాగర సంగమం, ఏక్ తుజే కేలియే, శుభసంకల్పం’ సినిమాలు చేశాను. ఇది నాకు సొంత ఇల్లు లాంటిది. మంచి ఆర్ట్ ఎక్కడ కనిపించినా దానికి నేను సెల్యూట్ చేస్తాను. అలాగే నేర్చుకున్నాను. నేను కొన్ని బ్యాడ్ ఫిలిమ్స్ చేశాను. అయితే నా బ్యాడ్ ఫిలిమ్స్ మర్చిపోయి కేవలం మంచి సినిమాలనే గుర్తుపెట్టుకున్నారు. అందుకుగాను మనస్పూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మంచి సినిమాలు మీకు అందించడం నా బాధ్యత.”

“నేను 15 తెలుగు సినిమాలు చేస్తే అందులో 13 విజయవంతమైన చిత్రాలుగా నిలిచాయి. ఆ విజయాల్ని మీరే ఇచ్చారు. ప్లాప్స్ మాత్రమే నేను ఇచ్చాను. ఇది నిజం. ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికి థగ్ లైఫ్ సినిమా మీకు అందిస్తున్నాను. ఒక కళాకారుడు చేసే పని ఇదే ఇది. చాలా గ్రేట్ ఫిలిం ఇది. శింబు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో కనిపించారు.”

“అభిరామి గారు అద్భుతమైనటువంటి నటనను కనబరిచారు. నాజర్ గారితో నాది వెరీ లాంగ్ జర్నీ. ఆయన లాంటి నటుడు దొరకడం చాలా కష్టం. త్రిష పెర్ఫార్మెన్స్‌ని చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా గొప్ప సినిమా చేశామని మేము నమ్ముతున్నాం. జూన్ 5న మేము అనుకున్నది కరెక్టా, లేదా అనేది మీరు సినిమా చూసి చెప్పాలి. ఈ సినిమాకి మీరు ఇచ్చే రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నాను. జూన్ 5న అందరం థియేటర్స్‌లో కలుద్దాం” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.