అఖిల్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌కి ఆహ్వానం

Nagarjuna Akkineni Invites CM Revanth Reddy To His Son Akhil Marriage

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున అక్కినేని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డిని కలిశారు. ఈ మేరకు ఆయన తన భార్య అమలతో కలిసి శనివారం ఉదయం హైదరాబాద్ జూబిలీహిల్స్‌‌లోని సీఎం నివాసానికి విచ్చేసి మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా తమ తనయుడు, యంగ్ హీరో అఖిల్ వివాహం త్వరలో జరుగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిని ఆహ్వానించేందుకు నాగార్జున దంపతులు సీఎంను కలిశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక వీరి వెంట వారి వియ్యంకులు కూడా ఉండటం విశేషం. ఈ సందర్భంగా ఇరు కుటుంబాలు సీఎం రేవంత్ రెడ్డికి వెడ్డింగ్ కార్డుని అందించి జూన్ 6న జరుగనున్న తమ బిడ్డల వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. దీనిపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. నాగార్జున దంపతులను ఆప్యాయంగా పలకరించిన ముఖ్యమంత్రి, అఖిల్‌కు ముందస్తు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా అఖిల్ పరిణయమాడనున్న అమ్మాయి పేరు జైనబ్‌. ఈమె ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్జీ కుమార్తె. గతేడాది నవంబర్ 26న వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జూన్ 6న వీరి వివాహం జరుగబోతోంది.

ఇక 1994లో ‘సిసింద్రీ’ చిత్రంతో బాలనటుడిగా వెండితెరపై కనిపించిన అఖిల్.. ఆ తర్వాత 2015లో వచ్చిన ‘అఖిల్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో ‘హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్‌’ వంటి చిత్రాల్లో న‌టించాడు. ప్రస్తుతం ఆయన ‘లెనిన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. దీనికి కిశోర్ అబ్బూరు డైరెక్షన్ చేస్తుండగా.. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.