కీరవాణిని సత్కరించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan Felicitates Keeravaani For Amazing Sound Track of Hari Hara Veera Mallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మచ్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ జూన్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రీ-రికార్డింగ్, డబ్బింగ్ మరియు VFX పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టేసిన మేకర్స్ రెండు పాటలు రిలీజ్ చేయగా, మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. రేపు మూడో పాట రానుంది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలావుంటే, తాజాగా పవన్ కళ్యాణ్ ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాకి అందించిన అద్భుతమైన సౌండ్ ట్రాక్‌కి గానూ కీరవాణిని సత్త్కరించారు పవన్. సాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఆయనను అభినందించారు. అనంతరం ఇరువురూ కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ఇక పవన్ వెంట చిత్ర నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణ వెంట ఉన్నారు.

ఇక ఈ మూవీలో ప్రముఖ బాలీవుడ్ నటుడు, ‘యానిమల్’ ఫేమ్ బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా.. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది.

పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకి యువ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. మనోజ్ పరమహంస కెమెరా, తోట తరణి ఆర్ట్ అందిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.