భైరవం.. ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటివరకు చేయలేదు

Hero Manchu Manoj Reveals Interesting Facts About Bhairavam Movie

టాలీవుడ్ యంగ్ హీరోస్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధానపాత్రల్లో నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’. వీరి సరసన ఆదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై కథానాయికలుగా నటించారు. ఇప్పటికే టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెళ్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 30న వేసవి సీజన్‌లో బిగ్గెస్ట్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. అలాగే మే 20 మంచు మనోజ్ బర్త్ డే. ఈ నేపథ్యంలో మనోజ్ మంచు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

భైరవం జర్నీ ఎలా స్టార్ట్ అయింది?

  • ఒక సినిమా ఈవెంట్ కి వెళ్ళినప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు కలిశారు.
  • డైరెక్టర్ విజయ్ నన్ను కలవాలని అనుకుంటున్నారని చెప్పారు.
  • అలా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. విజయ్ గారు ఈ కథ గురించి చెప్పారు.
  • నాకు చాలా నచ్చింది. ఇమ్మీడియట్‌గా ఓకే చేశాను. ఇది చాలా మంచి యాక్షన్ డ్రామా.

ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?

  • గజపతి వర్మ లాంటి క్యారెక్టర్ ఇప్పటివరకు నేను చేయలేదు. చాలా ఇంటెన్స్ అండ్ ఫెరోషియస్ క్యారెక్టర్.
  • భైరవం తప్పకుండా నా కెరియర్‌లో చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చాలా ఎమోషన్ అయ్యారు కదా?

  • తొమ్మిదేళ్లయింది సినిమాలకి దూరమై. కొన్ని కారణాల వల్ల బ్రేక్ తీసుకున్నాను.
  • ఇప్పుడు మళ్లీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడం వెరీ ఎమోషనల్ మూమెంట్.

ఇందులో మీ ముగ్గురికి స్క్రీన్ టైం ఎలా ఉండబోతుంది?

  • ఇందులో ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవరి స్క్రీన్ స్పేస్ వారిదే, ప్రతి ఒక్కరూ ఫెంటాస్టిక్‌గా పెర్ఫార్మ్ చేశారు.
  • డైరెక్టర్ ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా రాశారు. చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి.
  • సాయి నాకు తమ్ముడులాంటి వాడు. రోహిత్ నాకు మంచి ఫ్రెండ్.
  • ఈ సినిమా వలన మీ ముగ్గురు ఎక్కువ టైం స్పెండ్ చేసాము. కాబట్టి మా మధ్య బాండింగ్ మరింత పెరిగింది.
  • నా పర్సనల్ లైఫ్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా షూటింగ్‌కి ఇబ్బంది కలగకుండా జెట్ స్పీడ్‌లో చేసుకుంటూ వెళ్ళాం.
  • ఇది కూడా రోహిత్ గారి నుంచి ఇన్స్పిరేషన్‌గా వచ్చింది.
  • ఇందులో సాంగ్ చేస్తున్న సమయంలో ఆయన కుటుంబంలో ఒక విషాదం చోటుచేసుకుంది.
  • ఆయన ఆ బాధలోనే షూటింగ్‌కి ఎక్కడా ఇబ్బంది కలగకుండా పాటని ఫినిష్ చేశారు. రియల్లీ హాట్సాఫ్.
  • డైరెక్టర్ విజయ్ గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్‌లా అయిపోయారు.

నాన్నగారు నుంచి మీరు ఏం నేర్చుకున్నారు?

  • నమ్మినోళ్ళని బాగా చూసుకోవడం, పదిమందికి హెల్ప్ చేయడం. ఆయన కష్టపడుతూ పైకి వచ్చారు.
  • ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. నిజాయితీగా ఉండడం ఆయన దగ్గరే చూసి నేర్చుకున్నాను. నాకు మా ఫాదరే హీరో.

మీరు మంచిగా బిర్యాని వండుతారని అతిధి శంకర గారు చెప్పారు?

  • హాస్టల్లో ఉండే వాళ్ళం కాబట్టి వంట చేయడం అలవాటు.
  • అలా సెట్స్‌లో ఉండేటప్పుడు కూడా కొంచెం సమయం దొరికితే వంట చేయడం మొదలు పెట్టే వాళ్ళం.
  • అలాగే రోహిత్ గారు కూడా చాలా మంచి వంట చేస్తారు.

మీరు సోలోగా ఎప్పుడు వస్తున్నారు?

  • ‘అహం బ్రహ్మాస్మి’ సోలోగా వద్దామని చేసుకున్న కథ. అయితే అది కొన్ని కారణాల వల్ల కుదరలేదు.
  • ఐతే దేవుడు ఇలా ప్లాన్ చేశాడు. భైరవం మిరాయి ఇవన్నీ కూడా దేవుడు ప్లాన్ చేసిన సినిమాలే అనుకుంటున్నాను.

డైరెక్టర్ విజయ్ కనకమేడల గురించి?

  • విజయ్ తెలుగు ఆడియన్స్ పల్స్ మీద చాలా మంచి గ్రిప్ ఉంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని ప్రజెంట్ చేశారు.
  • గరుడన్ సినిమా చూసిన వాళ్లు కూడా ఈ సినిమా చూస్తే చాలా సర్ప్రైజ్ అవుతారు. తన మీద చాలా గౌరవం పెరిగింది.
  • ఆయన లాంటి డైరెక్టర్స్ మరింత మంది రావాలి. ఈ సినిమాలో నా లుక్‌ని నా కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేసింది కూడా డైరెక్టర్ గారే.
  • సినిమా చూసాం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. సినిమా మాకు చాలా నచ్చింది. తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది.

శ్రీ చరణ్ మ్యూజిక్ గురించి?

  • శ్రీ చరణ్ బ్యూటిఫుల్ ఆల్బమ్ ఇచ్చారు. రేపు ఒక స్పెషల్ సాంగ్ రాబోతుంది. సాంగ్ అదిరిపోయింది.
  • మీ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోరు చింపేసాడు. రేపు సినిమా చూసిన అందరూ కూడా ఇదే చెప్తారు.

ఈ బర్త్ డే రెజ్యూల్యూషన్ ఏమిటి?

  • చాలా తీసుకున్నాం. ఈ బర్త్ డే నుంచి నాకు ఒక కొత్త జన్మ మొదలు కాబోతోంది.
  • బర్త్ డే స్టార్ట్ అవ్వకముందే ఏ స్టేజ్ అయితే మిస్ అయ్యానో దేవుడు మళ్లీ ఇచ్చాడు.
  • మాక్సిమమ్ టైం మూవీస్ చేయాలని భావిస్తున్నాను.

బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్ గురించి?

  • ఈ సినిమా కోసం ఒక మ్యాసీవ్ టెంపుల్ సెట్ వేశారు. చాలా అద్భుతంగా వచ్చింది.
  • ఆ సెట్‌కి ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది.

నిర్మాత రాధా మోహన్ గారి గురించి?

  • ఈ రోజుల్లో అలాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఉండడం చాలా అరుదు. కథను నమ్మి ఎక్కడ రాజీ పడకుండా చేశారు.
  • రియల్లీ హాట్సాఫ్ అలాంటి నిర్మాతల్ని మనం ఎంకరేజ్ చేయాలి.

నెక్స్ట్ మీ దగ్గర నుంచి ఎలాంటి సినిమాలు ఆశించవచ్చు?

  • నేను బిగినింగ్ నుంచి చాలా ఎక్స్‌పరిమెంటల్ సినిమాలు చేశాను.
  • నాకు ఒక సినిమాకి మరొక సినిమాకి కంప్లీట్ డిఫరెంట్ ఉండే సినిమాలు చేయాలని ఎప్పుడూ ఉంటుంది.
  • భవిష్యత్తులో కొత్త రకం సినిమాలు చేయాలని వుంది.అలాగే పిల్లల కోసం ఒక సినిమా చేయాలనుంది.
  • ఎప్పుడైనా అవకాశం వస్తే అలాంటి ఒక సినిమా చేస్తాను.

ఆల్ ది బెస్ట్..

థాంక్ యూ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.