ఖుషి , బంగారం తరువాత పవన్ కళ్యాణ్ ,ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం కాంబినేషన్ లో వస్తున్న సినిమా హరి హర వీరమల్లు.జూన్ 12న విడుదలకు సిద్దమవుతుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.రీసెంట్ గానే షూటింగ్ పూర్తిచేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు చెన్నైలో భారీ ప్రెస్ మీట్ ను నిర్వహించారు.అయితే పవన్ దీనికి హాజరుకాలేకపోయారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈవెంట్ లో ఏఎమ్ రత్నం మాట్లాడుతూ పవన్ తో సత్యాగ్రహి చేద్దాం అనుకున్నాం.లాంచ్ కూడా అయ్యింది కానీ సెట్స్ మీదకు తీసుకురాలేకపోయాము.ఆ తరువాత వేదాలమ్ రీమేక్ చేద్దామనుకున్నాం కానీ అది కూడా కుదరలేదు.ఇక చివరికి హరి హర వీరమల్లు తో కుదిరింది.ఈసినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని అన్నారు.
పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను సగానికి పైగా క్రిష్ డైరెక్ట్ చేయగా మిగితా భాగం జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశాడు.ఇందులో నిధి అగర్వాల్ ,నోరా ఫతేహి, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.ఈసినిమా రెండు భాగాలుగా పాన్ ఇండియా రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: