పుష్ప 2 తరువాత ఐకాన్ స్టార్, అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో చేయనున్నాడని తెలిసిందే. లాస్ ఏంజెల్స్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా అల్లు అర్జున్,హాలీవుడ్ టెక్నిషియన్స్,దర్శకుడు అట్లీలపై చిత్రీకరించిన ఓ ప్రత్యేక వీడియో ద్వారా ఈ మూవీ అనౌన్స్‌మెంట్ చేశారు.ఇక గత కొన్ని రోజులుగా ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో వుంది.ఇందులో భాగంగా దర్శకుడు అట్లీ బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు.అట్లీ,అల్లు అర్జున్ ను కలిసి ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ సంబంధించిన చర్చల్లో పాల్గొనబోతున్నారు.జూన్‌లో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం A22 x A6గా పిలవబడుతున్న ఈ చిత్రం భారతీయ విలువలతో కూడిన కథనంతో కూడిన ఓ భారీ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.అత్యంత భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.నటీనటులు,సాంకేతిక బృందం వంటి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.వచ్చే ఏడాదిలోగా షూటింగ్ ను కంప్లీట్ చేసి 2027 లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక అల్లు అర్జున్, త్రివిక్రమ్ తో కూడా సినిమా చేయనున్నాడు.మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈసినిమాను గీతా ఆర్ట్స్ ,హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించనున్నాయి.కుదిరితే సెప్టెంబర్ లో లాంఛ్ చేయాలని చూస్తున్నారు.అల్లు అర్జున్ ఈరెండు సినిమాలను బ్యాలెన్స్ చేయనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: