మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి హిందీ సినిమా ‘వార్ 2’. ఇందులో స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి తారక్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చేసుకున్న ఈ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 14న థియేటర్లలో విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఎన్టీఆర్ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. దీనిని పురస్కరించుకుని నేడు వార్ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. దీనికి సంబంధించి ఇటీవలే హీరో హృతిక్ రోషన్ జూనియర్ కి బర్త్ డే గిఫ్ట్ గా వార్ 2 నుంచి ఒక స్పెషల్ వీడియో రానుందని తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ టీజర్ విడుదలచేసింది చిత్ర బృందం.
ఇదిలావుంటే, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ నటించిన మొదటి బాలీవుడ్ ఫిల్మ్ కావడంతో ఇటు టాలీవుడ్ సహా అటు హిందీ చిత్ర పరిశ్రమలోనూ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు హృతిక్ రోషన్ ఉండటంతో ఇరువురి అభిమానులతోపాటుగా మూవీ లవర్స్ కూడా దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో వార్ 2 తెలుగు రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది.
మరోవైపు ఎన్టీఆర్ ‘కేజీఎఫ్’, ‘సలార్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. దీనికి ఇంకా టైటిల్ ప్రకటించాల్సివుంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 1960ల నాటి కలకత్తా నేపథ్యంలో జరిగే కథగా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ కానుంది.
అయితే వార్ 2కి బాక్సాఫీస్ వద్ద ‘కూలీ’ రూపంలో గట్టి పోటీ ఎదురుకానుంది. సూపర్ స్టార్ రజినీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా కూడా ఆగస్టు 14నే విడుదలకానుండటం తెలిసిందే. ఇక ఈ మూవీలో కింగ్ నాగార్జున కూడా నటిస్తుండడంతో తమిళంలోనే కాకుండా తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి. ఉపేంద్ర,శృతి హాసన్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: