కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న మూవీ ‘జూనియర్’. వారాహి చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాధా కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో టాప్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనీలియా మళ్లీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుండటం విశేషం. అలాగే కన్నడ సినిమా ఐకాన్, క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్రన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా జూన్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ ఫస్ట్ సింగిల్ ‘లెట్స్ లివ్ దిస్ మోమెంట్’ ను విడుదల చేశారు. టైటిల్ లో చెప్పినట్టే, ఎనర్జిటిక్, సెలబ్రేషన్ స్పిరిట్‌తో నిండిపోయింది.
జీవితం, ప్రేమ, సంగీతం – అన్నిటినీ కలిపే ఫీలింగ్ తో, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జీ ఈ పాటను మరింత రిచ్ గా కంపోజ్ చేశారు. డీఎస్పీ హై ఎనర్జీతో, ఫుట్ టాపింగ్ బీట్‌లతో పాటను కంపోజ్ చేశారు. ఎలక్ట్రానిక్ మ్యూజిక్‌తో బ్లెండ్ అయిన ఈ ట్యూన్‌లో యువతను ఆకట్టుకునే విబ్రెన్సీ ఉంది. జస్ప్రీత్ జాజ్ వాయిస్ ఈ పాటకి శక్తినిచ్చింది.
శ్రీమణి రాసిన సాహిత్యం ఎమోషన కలిగించేలా ఉంది. విజువల్‌గా ఈ పాటలో కిరీటి, శ్రీలీల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కిరీటి గ్రేస్‌ఫుల్ డాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకుంటున్నారు. కొరియోగ్రాఫర్ విజయ్ పొలాకి రూపొందించిన కొరియోగ్రఫీ అదిరిపోయింది. కలర్‌ఫుల్ సెట్స్‌పై గ్రాండ్‌గా చిత్రీకరించిన ఈ పాట విజువల్ గా కూడా అద్భుతంగా కనిపిస్తుంది.
ఈ చిత్రానికి అన్ని విభాగాల్లోనూ ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంటిల్ కుమార్ సినిమాకు విజువల్ గ్రాండియర్ అందించగా, ప్రొడక్షన్ డిజైన్ కోసం రవీందర్, యాక్షన్ కోసం ఇండియా టాప్ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హైన్ పని చేశారు. డైలాగ్స్ కల్యాణ్ చక్రవర్తి త్రిపురనేని రాయగా, నిరంజన్ దేవరమనే ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: