బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ కలిసి నటించిన సినిమా భైరవం.మరో 10 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ గరుడన్ కి రీమేక్ గా తెరకెక్కింది. ట్రైలర్ ఈసినిమాకు హైప్ తీసుకొచ్చింది.యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నాంది ఫేమ్ విజయ్ కనకమేడల ఈసినిమాను డైరెక్ట్ చేశాడు. ఇక ఈసినిమా రిలీజ్ ముందే సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాన్ థియేట్రికల్ రైట్స్ ను జీ గ్రూప్ 32 కోట్లకు దక్కించుకుందట.సాయి శ్రీనివాస్ కు హిందీలో మంచి మార్కెట్ వుంది.అతని సినిమాలు హిందీలో డబ్ అయ్యి సెన్సేషనల్ వ్యూస్ ను అలాగే సాలిడ్ టీఆర్పీని రాబట్టుకున్నాయి.అది భైరవంకు అడ్వాంటేజ్ అయ్యింది.ఇక ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో థియేట్రికల్ రైట్స్ కూడా మంచి ధరకు అమ్ముడయ్యాయి.దాంతో విడుదలకుముందే నిర్మాత బయటపడిపోయాడు.
ఈసినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు.ఇక చాలా గ్యాప్ తరువాత సాయి శ్రీనివాస్ ,మంచు మనోజ్ భైరవం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి ఈసినిమా వీరికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: