పొన్నియిన్ సెల్వన్ 2 తరువాత లెజండరీ డైరెక్టర్ మణిరత్నం నుండి వస్తున్న సినిమా థగ్ లైఫ్.కమల్ హాసన్ హీరో గా నటించగా శింబు ,అశోక్ సెల్వన్ , త్రిష , ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రలు పోషించారు.విడుదల డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు మూవీ టీం.అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ అవ్వగా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.ఈట్రైలర్ తో సినిమాకు ఒక్కసారిగా హైప్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా సెన్సార్ కూడా జరిగిపోయింది.థగ్ లైఫ్ కి యు / ఏ సర్టిఫికెట్ జారీ చేయగా 2 గంటల 45 నిమిషాల రన్ రన్ టైం తో థియేటర్లలోకి రానుంది.ఏఆర్ రెహమాన్ ఈసినిమాకు సంగీతం అందించగా కమల్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మించింది.జూన్ 5న పాన్ ఇండియా రిలీజ్ కానుంది. అలాగే రేపు ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ షుగర్ బేబి రిలీజ్ కానుంది.ఇంతకుముందు వచ్చిన ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఇక విక్రమ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చిన కమల్ హాసన్ ఆతరువాత ఇండియన్ 2తో నిరాశపరిచాడు.భారీ అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది.ఇక ఇప్పుడు థగ్ లైఫ్ తో వస్తున్నాడు.మరి ఈసినిమాతో కమల్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: