బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెళ్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీగా నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా మే 30న వేసవి సీజన్‌లో బిగ్గెస్ట్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీం థియేట్రికల్ ట్రైలర్ ఏలూరులో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు ప్రేక్షకులు హాజరైన ఈ వేడుక చాలా సక్సెస్ ఫుల్‌గా జరిగింది. ఏపీ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పుట్ట మహేష్, ఎమ్మెల్యేలు రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. అందరూ ట్రైలర్ ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ట్రైలర్ లానే సినిమా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. అందరూ సినిమాని సపోర్ట్ చేసి ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. చాలా ప్రేమించి ఇష్టపడి కష్టపడి మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని చేశాం. మే 30 న భైరవం మీ అందరి ముందుకు వచ్చి మీ అందరిని అలరిస్తుంది.”
“ఈ సినిమాకి పనిచేసిన నటీనటులకు టెక్నీషియన్స్‌కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి, ఏలూరు ఎంపీ మహేష్ గారికి ధన్యవాదాలు. ఆయన ప్రోత్సహంతోనే ఈ వేడుక ఏలూరులో జరుగుతోంది. ఆయన వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి చాలా ఆనందాన్ని ఇచ్చింది. నేను, రాధా మోహన్ గారు ఒక మంచి సినిమా చేద్దామని మొదట్నుంచి అనుకున్నాం. చాలా మంచి కథ దొరికింది.”
“ఇంత మంచి సినిమా తీసిన నిర్మాత రాధ మోహన్ గారికి శ్రీధర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. విజయ్ గారు మేకింగ్ ఎమోషన్స్‌తో ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే భైరవం. శ్రీ చరణ్ మ్యూజిక్ మ్యూజికల్ ఫీస్ట్‌లా ఉంటుంది. ఈ సినిమాకు పని చేసిన దివ్య, ఆనంది అతిధి శంకర్ కి థాంక్యూ. ఈ సినిమాకి కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ విజయం నారా రోహిత్ గారు ఈ సినిమా ఒప్పుకోవడంతో జరిగింది. ఆయన సినిమాని ఒప్పుకోవడం మోస్ట్ హ్యాపీ మూమెంట్.”
“రోహిత్ అన్న వెరీ నైస్ పర్సన్. మనోజ్ గారు నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలకి నేను పెద్ద ఫ్యాన్‌ని. అన్ని సినిమాలు చేసిన ఎక్స్‌పీరియెన్స్ ఉన్న యాక్టర్ మా సినిమాలో చేయడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. గజపతి వర్మ క్యారెక్టర్‌లో ఆయన తప్పితే మరొకరిని ఊహించలేం. ఈ వేడుకకొచ్చి ఇంత అద్భుతంగా సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మే 30న అందరూ థియేటర్స్‌లో కలుద్దాం. లవ్ యూ ఆల్” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: