లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘థగ్ లైఫ్’. జూన్ 5న థియేటర్లలో విడుదలకానుంది. కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై క్యూరీయాసిటీని పెంచింది. ఆ తర్వాత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ మ్యూజిక్ లవర్స్‌ని ఇంప్రెస్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఈ ఉత్సాహాన్ని కొనసాగించేందుకు మూవీ టీం ఇప్పుడు ప్రమోషన్‌లకు స్పెషల్ ప్లాన్ రూపొందించింది. దీనిలో భాగంగా నేడు థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసింది. మణిరత్నం తన ట్రేడ్ మార్క్ మరోసారి ఆడియెన్స్ కి రుచిచూపించనున్నారు. ఆయన దీనిని విజువల్ వండర్‌గా తెరకెక్కించారు. ట్రైలర్ ఆద్యంతం థ్రిల్ పంచేలావుంది. కమల్ హాసన్ మరోసారి నటవిశ్వరూపం చూపించాడని అర్ధమవుతోంది. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
ఇక ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి, త్రిష ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. యంగ్ హీరోలు శింబు, గౌతమ్ కార్తీక్, అశోక్ సెల్వన్, నాజర్, మరియు పాపులర్ మాలీవుడ్ యాక్టర్ జోజు జార్జ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు.
మద్రాస్ టాకీస్, రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్‌పై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్ మరియు శివ అనంత్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించారు. ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ ఈ సినిమాని సమర్పిస్తోంది. హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన ఈ సంస్థ ఇప్పుడు థగ్ లైఫ్ భారీగా విడుదల చేయబోతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: