కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ #సింగిల్. కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మే 9న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అందరినీ అలరించి సమ్మర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో మూవీ టీం అంతా పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా ఈ వేడుకకు హాజరైన ప్రొడ్యూసర్స్ ఎస్‌కేఎన్ మరియు బన్నీ వాసు చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. “ఆయ్, తండేల్, సింగిల్ సినిమాలతో హ్యాట్రిక్ సాధించిన గీత ఆర్ట్స్ కి బిగ్ కంగ్రాట్యులేషన్స్. గీతా ఆర్ట్స్ ఎప్పుడు సీజన్స్ ని నమ్మదు కంటెంట్ అనే రీసన్ ని నమ్ముతుంది. గీత ఆర్ట్స్ ఎప్పుడు టాలెంట్ నే ఎంకరేజ్ చేస్తుంది. అందుకు అరవింద్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా చూస్తున్నప్పుడు థియేటర్స్ లో జనం విజల్స్ కొట్టి అరుస్తున్నారు. థియేటర్స్ లో అలాంటి వైబ్ చూడ్డం చాలా కష్టం.”
“కంటెంట్ ఉంటే అలాంటి నవ్వులు వస్తాయి. డైరెక్టర్ కార్తీక్ రాజు తెలుగు పల్స్ ని చాలా అద్భుతంగా పట్టుకొని ఈ సినిమా తీశారు. ఈ సినిమాతో ఘనవిజయం అందుకున్న అందరికీ థాంక్యు కంగ్రాజులేషన్స్. ఇప్పుడున్న చాలామంది ప్రామిసింగ్ డైరెక్టర్స్ శ్రీ విష్ణు గారు హీరోగా చేసిన సినిమాలతోనే వచ్చారు. అంత మంచి టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ కొత్త ప్రతిభని ఇండస్ట్రీ లోకి తీసుకొస్తున్న శ్రీ విష్ణు గారికి థాంక్స్. సింగిల్ సక్సెస్ మరింత అద్భుతంగా ఆడుతుందని కోరుకుంటున్నాను” అని అన్నారు.
అలాగే ప్రొడ్యూసర్ బన్నీ వాసు మాట్లాడుతూ.. “ఈ వేదికపై నుంచి అల్లు అరవింద్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆయన ఇచ్చే సపోర్ట్ తోనే ఇక్కడ ఉన్నాం. సింగిల్ సినిమా అద్భుతంగా ధియేటర్స్ లో రన్ అవుతుంది అంటే దానికి కారణం శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ గారు డైరెక్టర్ కార్తీక్ రాజు. ఈ సినిమా విజయం టోటల్ ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడింది.”
“ఈ సినిమా ఈ మంత్ ని సేవ్ చేసింది. ధియేటర్లో డైలాగులు కంటే నవ్వులు ఎక్కువ వినిపిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అయినట్లే సింగిల్ సినిమాలో కూడా చాలామంది ఆడియన్స్ మాకు డైలాగులు వినిపించడం లేదు పక్కన కూర్చున్న వారి నవ్వులే వినిపిస్తున్నాయని చెప్పారు. అదే సక్సెస్ కి నిదర్శనం. టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: