మ్యాడ్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చి వరసగా విజయాలను ఖాతాలో వేసుకున్నాడు ఎన్టీఆర్ బావమరిది ,యంగ్ హీరో నార్నే నితిన్ . రెండేళ్ల క్రితం మ్యాడ్ తో ఇంట్రడ్యూస్ అవ్వగా ఈసినిమా సూపర్ హిట్ అనిపించుకుంది.ఆ తర్వాత గత ఏడాది సోలో హీరోగా ఆయ్ తో వచ్చి మరో హిట్ కొట్టాడు.ఇక ఈఏడాది మ్యాడ్ సీక్వెల్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.మార్చి లో విడుదలైన ఈసినిమా 70కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.అలా హ్యాట్రిక్ హిట్ల తో ఫుల్ ఫామ్ లో వున్నా నితిన్ నెక్స్ట్ శ్రీ శ్రీ శ్రీ రాజావారుతో రానున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జాతీయ అవార్డు విన్నర్ శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నార్నె నితిన్ నటించిన సినిమా శ్రీ శ్రీ శ్రీ రాజావారు.ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకోగా ఈరోజు రిలీజ్ డేట్ వచ్చేసింది. జూన్ 6న విడుదలకానుంది.ఇందులో సంపద హీరోయిన్ గా నటించగా శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు.అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాకు కైలాష్ మీనన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ, ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో బిగ్ హిట్ మూవీని నిర్మించాలని నార్నె నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో ఈ చిత్రాన్ని రూపొందించాం.మా చిత్ర హీరో నార్నె నితిన్ ఇటీవల మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ తో వరుస విజయాలు అందుకుంటున్నారు.ఇక శ్రీ శ్రీ రాజావారు విషయానికొస్తే మంచి గ్రామీణ నేపథ్యంలో సాగే వెరైటీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో భారీ తారాగణంతోతెరకెక్కించారు దర్శకుడు సతీష్ వేగేశ్న.అలాగే ఎన్టీఆర్ ఎంతో మెచ్చి, ఈ కథను ఎంపిక చేశారు.ఆయన అంచనాల మేరకు దర్శకుడు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు.ఖచ్చితంగా ఈ జూన్ 6న నార్నె నితిన్ ఖాతాలో ఆయ్ ,మ్యాడ్ తరహాలోమరో సూపర్ హిట్ హిట్ పడుతుందని గట్టిగా నమ్ముతున్నాం అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: