ఇండియన్ సినిమా పితామహుడు ‘దాదాసాహెబ్ ఫాల్కే’ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం రూపొందబోతోంది. క్రేజీ కాంబోలో ఇది తెరకెక్కుతుండటం విశేషం. బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఈ బయోపిక్‌లో దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో నటించనున్నారు. అలాగే క్రియేటివ్ జీనియస్ రాజ్‌కుమార్ హిరానీ దీనికి దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఇందుకు సంబంధించి అమీర్ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ మధ్య స్టోరీ విషయంలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘త్రీ ఇడియట్స్, పీకే’ చిత్రాలు బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరు లెజెండరీ పర్సనాలిటీ బయోపిక్‌తో హ్యాట్రిక్‌పై కన్నేశారు. ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ సోషల్ మీడియా వేదికగా దీని గురించి వెల్లడించారు. ఈ వార్త ఇప్పుడు బీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారగా.. మరోవైపు అమీర్ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ కాంబోలో వచ్చే సినిమా కోసం మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
కాగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌తో ‘డంకీ’ తీసిన తర్వాత హిరానీ దర్శకత్వం వహించనున్న సినిమా ఇదే. ఇక ప్రస్తుతం ఆమిర్ ఖాన్ నటించిన ‘సితారే జమీన్ పర్’ జూలై 20న విడుదలకు సిద్ధమవుతోంది. జెనీలియా డిసౌజా ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది. దీని తర్వాత ఈ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: