నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల బ్లాక్ బస్టర్ ‘దసరా’ తర్వాత ‘ది ప్యారడైజ్’ కోసం మరోసారి కొలాబరేట్ అయ్యారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దసరాకు మించిన యాక్షన్‌తో దీనిని రూపొందిస్తున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్. దీనికోసం ఆయన పవర్ ఫుల్ లార్జర్ దేన్ లైఫ్ కథను ఇంటెన్స్ స్క్రీన్‌ప్లేతో రూపొందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా నానిని పూర్తిగా కొత్త, మాస్-డ్రైవ్ అవతార్‌లో ప్రజెంట్ చేయనుంది. ఇందుకు నిదర్శనంగా మార్చి 3న ‘రా స్టేట్‌మెంట్’ పేరుతో రిలీజ్ చేసిన గ్లింప్స్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కంప్లీట్ బోల్డ్ అండ్ వైల్డ్‌గా రూపొందిన ఈ గ్లింప్స్‌లో నెవర్ బిఫోర్ రోల్‌లో కనిపించి నాని అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ గ్లింప్స్ OST రిలీజ్ చేశారు మేకర్స్.
కాగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. నాని, అనిరుధ్ కలిసి పనిచేస్తున్న మూడవ చిత్రం ఇది. ఇంతకుముందు వీరి కాంబోలో ‘జెర్సీ, గ్యాంగ్ లీడర్’ సినిమాలు వచ్చాయి. ఇవి మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో మరోసారి వీరి కాంబో మరోసారి రిపీట్ అవుతుండటంతో ఈ అప్ కమింగ్ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా వున్నాయి.
దసరా కాంబోలో వస్తోన్న ది ప్యారడైజ్‌పై అంచనాలు ఎక్కువగా వున్నాయి. అలాగే డైరెక్టర్ శ్రీకాంత్ దీనిని గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఇంకా ఈ మూవీ ఇప్పటివరకు నాని యొక్క మోస్ట్ హై బడ్జెట్ వెంచర్ కావడం గమనార్హం. ఇక ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. కాగా ప్యారడైజ్ వచ్చే ఏడాది మార్చి 26న తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్ మరియు స్పానిష్ భాషల్లో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























