మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విశ్వంభర. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఈ సంవత్సరం మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రాలలో ఒకటి. ఇప్పటికే పోస్టర్లు, టీజర్ భారీ అంచనాలను నెలకొల్పాయి. ప్రతిష్టాత్మక యువి క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం మ్యూజిక్ ప్రమోషన్స్‌ని ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్‌తో ప్రారంభించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“జై శ్రీ రామ్” అనే నినాదాన్ని ప్రతిధ్వనించే ఈ సాంగ్ మ్యూజిక్ సెన్సేషన్‌గా మారి చార్ట్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ మ్యూజిక్‌లో 25+ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి అన్ని మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతూ బ్లాక్ బస్టర్ హిట్‌గా అదరగొడుతోంది.
సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి డాన్స్ గ్రేస్, ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్, రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన లిరిక్స్, మ్యాసీవ్ సెట్.. ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేశాయి. రానున్న రోజుల్లో ఈ సాంగ్ మరింత పెద్ద హిట్ కాబోతోంది.
తన బ్లాక్‌బస్టర్ ఫస్ట్ మూవీ ‘బింబిసార’తో చెరగని ముద్ర వేసిన దర్శకుడు వశిష్ట, ఇప్పుడు విశ్వంభరని అత్యద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. తద్వారా ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. దీనిని ఆయన తన అత్యంత ప్రతిష్టాత్మకమైన డ్రీం ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా, కునాల్ కపూర్ కీలక పాత్ర పోషించారు. మ్యూజికల్ జీనియస్ ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తుండగా.. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: