గత కొన్ని నెలలుగా ఏపీ రాజకీయాలలో తీరిక లేకుండా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. పవన్ హీరోగా ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరిహర వీరమల్లు’ చిత్రాలు రూపొందుతోన్న సంగతి తెలిసిందే. వివిధ దశల్లో ఇవి నిర్మాణంలో ఉండగా వీలయినంత త్వరగా వీటిని ముగించేందుకు తిరిగి షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఒకవైపు ఇప్పటికే ఓజీ షూట్ మొదలవగా.. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పునఃప్రారంభం కాబోతోంది. జూన్ 12నుంచి ఈ చిత్రం షూటింగ్ తిరిగి మొదలవనుంది. ఈ మేరకు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఇక ఇందుకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇక దీనిపై పవన్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఉస్తాద్ ప్రకటించినప్పటినుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి బలం చేకూరుస్తూ ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్‌కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ సినిమాలో పవన్ సరసన తొలిసారిగా యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. ఐనతకుముందు పవర్ స్టార్ పలు చిత్రాలకు అదిరిపోయే మ్యూజిక్ అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: