తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో గత వారం మంచి అంచనాల మధ్య థియేటర్లలోకి రాగ పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబడుతుంది. ముఖ్యంగా తమిళనాడు లో సూపర్ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్నటి తో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 104 కోట్ల వసూళ్లను రాబట్టుకుందని మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. అయితే చిన్న సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ వల్ల రెట్రోకి భారీ పోటీ ఎదురవుతుంది.టూరిస్ట్ ఫ్యామిలీ టాక్ సూపర్ గా ఉండడంతో అద్భుతుమైన వసూళ్లను సొంతం చేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రెట్రో తెలుగులోనూ రిలీజ్ కాగా హిట్ 3 వల్ల ఆశించినంత స్థాయిలో కలెక్షన్స్ రావడంలేదు.లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈసినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.
ఇక సూర్య ప్రస్తుతం ఆర్ జె బాలాజీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా సాయి అబ్యాంకర్ సంగీతం అందిస్తున్నాడు. డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈసినిమా సెట్స్ మీద వుండగానే సూర్య తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో నెక్స్ట్ సినిమా చేయనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది.త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























