మలయాళం స్టార్ మోహన్ లాల్ నటించి తుడరుమ్ కేరళ లో సరికొత్త రికార్డు నెలకొల్పింది.రిలీజ్ అయిన దగ్గర్నుండి సూపర్ మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.నిన్నటితో ఒక్క కేరళలోనే 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.దాంతో ఈ ఫీట్ సాధించిన మొదటి సినిమాగా తుడరుమ్ రికార్డుల్లోకి ఎక్కింది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా మళయాలం లో రికార్డులు క్రియేట్ చేస్తుంది.ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 220 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.200కోట్ల క్లబ్ లో చేరడం మోహన్ లాల్ కు ఇది వరుసగా రెండో సారి .ఇంతకుముందు ఎల్ 2 :ఎంపురాన్ తో ఈ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఇక ఫుల్ రన్ లో తుడరుమ్ హైయెస్ట్ మలయాళ గ్రాసర్ గా రికార్డు సృష్టించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తరుణ్ మూర్తి డైరెక్షన్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో శోభన ,థామస్ మాథ్యూ, షైజో ఆదిమాలి కీలక పాత్రల్లో నటించగా జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.తెలుగులో కూడా ఈసినిమా రిలీజ్ అయ్యింది కానీ అనుకున్నంతగా రెస్పాన్స్ తెచ్చుకోలేదు.
మరోవైపు వరుస విజయాలతో మోహన్ లాల్ దూసుకుపోతున్నాడు.మార్చిలో ఎల్ 2: ఎంపురాన్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టగా ఇక ఇప్పుడు నెల గ్యాప్ లో తుడరుమ్ తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: