దసరా కాంబినేషన్ రిపీట్ కానుందని తెలిసిందే.అందులో భాగంగా నేచురల్ స్టార్ నాని-డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో ది ప్యారడైజ్ రానుంది.రీసెంట్ గా ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా సెన్సేషన్ రెస్పాన్స్ వచ్చింది.ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని పాయింట్ తో ఈసినిమా రానుంది.నాని ఇందులో సరికొత్త గెటప్ లో కనిపించనున్నాడు.ఇక ఈసినిమా ఆడియో రైట్స్ ను సరిగమ మ్యూజిక్ దక్కించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంకా షూటింగ్ కూడా మొదలు కాకముందే భారీ ధరకు ఈ హక్కులను సొంతం చేసుకుంది.అనిరుధ్ ఉండడంతో ఆడియో రైట్స్ భారీ ధర పలికాయి.నాని కెరీర్ లో ఇదే హైయెస్ట్ ఆడియో రైట్స్ డీల్.అంతేకాదు ఈసినిమాకు సరిగమ సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.
ఇక రేపు ఉదయం11:07 గంటలకు ది ప్యారడైజ్ గ్లింప్స్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ని రిలీజ్ చేయనున్నారు.అతి త్వరలోనే ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.అనిరుధ్ సంగీతం అందిస్తుండగా దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలోకి రానుంది.ది ప్యారడైజ్ పాన్ ఇండియా రిలీజ్ తోపాటు ఇంగ్లీష్ ,స్పానిష్, జపనీస్ లో కూడా విడుదలకానుంది.
ఇక నాని ప్రస్తుతం హిట్ 3 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.గత నెల 30న ఈసినిమా థియేటర్లలోకి రాగ నిన్నటి వరకు 100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ అనిపించుకుంది.నానికి ఇది మూడో 100కోట్ల సినిమా.అంతేకాదు దసరాతో స్టార్ట్ అయిన నాని జైత్రయాత్ర హిట్ 3తో కంటిన్యూ అవుతుంది.మరి ది ప్యారడైజ్ తో నాని వరుసగా 5వ విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: