ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యువ దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న సినిమా ‘RAPO 22’ (వర్కింగ్ టైటిల్). మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. కొన్ని రోజులు క్రితం సాగర్ పాత్రలో రామ్ క్యారెక్టర్ లుక్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకుంది. మహా లక్ష్మి అనే కాలేజీ స్టూడెంట్ రోల్ లో తను కనిపించనుంది. క్యూట్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్‌లో పూర్తయింది. రామ్, ఇంకా ఇతర ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు తీశారు. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ మొదలవనుంది.
ఇక రీసెంట్ గా సీనియర్ స్టార్ నటుడు ఉపేంద్ర ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు ప్రకటించి సర్‌ప్రైజ్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. ‘RAPO 22’ టైటిల్ గ్లింప్స్ రేపు రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. కాగా ఈ చిత్రానికి మధు నీలకందన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ -మెర్విన్ సంగీతం సమకూరుస్తున్నారు. అలాగే అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: