‘నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా, బొమ్మరిల్లు’ సినిమాలతో తెలుగులో స్టార్‌డమ్ అందుకున్న హీరో సిద్ధార్థ్ ప్రధానపాత్రలో ‘3BHK’ అనే ఓ డిఫరెంట్ ఫిల్మ్‌లో నటిస్తున్నాడు. ఇందులో అతను మిడిల్ క్లాస్ కుర్రాడిగా కనిపిస్తున్నాడు. శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. 3BHK సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. ఈ సినిమాను జులై 4న రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపింది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటీనటులు శరత్ కుమార్, దేవయాని తల్లిదండ్రులుగా నటిస్తుండగా.. వారి తనయుడిగా సిద్దార్థ్, కుమార్తెగా మీతా రఘునాథ్ కనిపించనున్నారు. అలాగే చైత్ర, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకి అమృత్ రామ్‌నాథ్ మ్యూజిక్ అందిస్తుండగా.. దినేష్ కృష్ణన్ బి మరియు జితిన్ స్టానిస్లాస్ డీవోపీగా పని చేస్తున్నారు. గణేష్ శివ ఎడిటర్‌గా, రాకేందు మౌళి డైలాగ్ రైటర్‌గా వ్యవహరిస్తున్నారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై బ్లాక్ బస్టర్ హిట్ ‘మావీరన్’ నిర్మాత అరుణ్ విశ్వ తెలుగు – తమిళ్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: