తెలుగు చిత్రసీమలో విశిష్టమైన నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, దివంగత ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని ‘న్యూ టాలెంట్ రోర్స్ @’ బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే లాంచ్ చేసిన నందమూరి తారక రామారావు ఫస్ట్ దర్శన్ కి వరల్డ్ వైడ్ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ద్వారా ప్రతిభావంతులైన కూచిపూడి డ్యాన్సర్, తెలుగు అమ్మాయి వీణారావు కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా గ్రాండ్ ముహూర్తం షూట్ నిన్న హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ లో వైభవంగా జరిగింది. ప్రారంభోత్సవ వేడుకకు ఎన్టీఆర్ కుమార్తెలు శ్రీమతి గారపాటి లోకేశ్వరి, శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి, శ్రీమతి నారా భువనేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరో నందమూరి తారక రామారావు మాట్లాడుతూ.. మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. మా ముత్తాత నందమూరి తారక రామారావు గారు, పక్కనే నిల్చుని చూస్తున్న మా తాత నందమూరి హరికృష్ణ గారు, మా నాన్న నందమూరి జానకి రామ్ గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని నమ్ముతున్నాను.” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈరోజు నా కుటుంబసభ్యులందరూ నన్ను ప్రోత్సహించడానికి ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటినుంచి మీడియా ఎంతో సహకరించింది. వారందరికీ కృతజ్ఞతలు. ప్రేక్షకుల ప్రేమాభిమానాలే నన్ను ముందుకు నడిపిస్తాయని నమ్ముతున్నాను’’ అని అన్నారు.
అలాగే ఈ సినిమా హీరోయిన్ వీణ రావు మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. లోకేశ్వరి గారు భువనేశ్వరి గారు పురందేశ్వరి గారు ఈ వేడుకకు వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఉండాలి. ప్రేక్షకులు మా సినిమాని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: