బ్రో తరువాత పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ హరి హర వీరమల్లుతో రానున్నాడు.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ కంప్లీట్ చేశాడు.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో వుంది ఈసినిమా.ఇక ఈసినిమా ఓటిటి రైట్స్ కూడా అమ్ముడయ్యాయి.అమెజాన్ ప్రైమ్ ఈ హక్కులను భారీ ధరకు దక్కించుకుందట.ఓటిటి డీల్ క్లోజ్ కావడంతో థియేట్రికల్ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు.కుదిరితే ఈనెల చివర్లోనే విడుదలచేయాలని చూస్తున్నారు. లేకపోతే జూలైలో వచ్చే ఛాన్స్ వుంది. త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది.వచ్చే వారంలో ట్రైలర్ వచ్చే ఛాన్స్ వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను సగానికి పైగా క్రిష్ డైరెక్ట్ చేయగా మిగితా భాగం జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశాడు.ఇందులో నిధి అగర్వాల్ ,నోరా ఫతేహి, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత ఏఏం రత్నం నిర్మిస్తున్నారు.ఈసినిమా రెండు భాగాలుగా పాన్ ఇండియా రిలీజ్ కానుంది.
ఇక హరిహర వీరమల్లు షూటింగ్ చేసిన పవన్ నెక్స్ట్ ఓజీకి డేట్స్ కేటాయించాడు.నిన్నటి నుండి ఈసినిమా బ్యాలెన్స్ షూటింగ్ హైదరాబాద్ లో స్టార్ట్ కాగా రేపటి నుండి పవన్ ఇందులో జాయిన్ కానున్నాడు.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.సుజీత్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.తమన్ సంగీతం అందిస్తున్నాడు.డివివి దానయ్య నిర్మిస్తున్నారు.
ఈసినిమాను పూర్తి చేసి పవన్ నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా శ్రీ లీల ఓ హీరోయిన్ గా నటిస్తుంది.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: