మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు డైరెక్షన్ లో ఉస్తాద్ రామ్ పోతినేని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.షూటింగ్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది. ఇక ఈసినిమా నుండి నిన్న ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.అదేంటంటే కన్నడ స్టార్ ఉపేంద్ర ఈసినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడు.ఇందులో తను స్టార్ హీరోగా సూర్య కుమార్ అనే పాత్రలో కనిపించనున్నాడు.ఈపాత్ర సినిమాలో హైలైట్ అవ్వనుందట.ఇక రామ్, సాగర్ పాత్రలో ఉపేంద్రకు వీరాభిమాగా కనిపించనున్నాడు.సినిమాలో సూర్య ప్రభావం సాగర్ లైఫ్ స్టైల్ పై గట్టిగా వుంటుందట.సినిమా అయితే బాగానే వస్తుందట.అయితే ఉపేంద్ర షూటింగ్ లో జాయిన్ కావాల్సి వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రామ్ బర్త్ డే సందర్భంగా ఈ గురువారం ఈసినిమా టైటిల్ తోపాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ కానుంది.టైటిల్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.రామ్ ఇందులో కొత్త లుక్ లో కనిపించనున్నాడు.ఈసినిమాపై రామ్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.ఇందులో రామ్ సరసన మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇక ఈసినిమా రామ్ కి కీలకం కానుంది.గత కొన్ని సంవత్సరాల నుండి రామ్ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.ఈ22 వ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: