ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న 22వ సినిమా నుండి ఈనెల 15న అప్డేట్ ఇవ్వనున్నారని తెలిసిందే.అయితే అంత కన్నా ముందే ఈరోజు మరో కీలకమైన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో ఓ సీనియర్ హీరో కీలక పాత్రలో కనిపించనున్నాడని ఇంతకుముందే రివీల్ అయ్యింది. ఇక ఆ హీరో ఎవరనేది ఈరోజు చెప్పేశారు.కన్నడ స్టార్ ఉపేంద్ర ఇందులో కీలక పాత్రలో చేస్తున్నారు. అందని వాడు అందరి వాడు గా సూర్య కుమార్ పాత్రలో ఉపేంద్ర కనిపించనున్నాడు. ఈరోల్ సినిమాలో హైలైట్ అవ్వనుందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సన్ ఆఫ్ సత్యమూర్తి తరువాత ఉపేంద్రకు తెలుగులో స్ట్రెయిట్ సినిమా ఇదే.ఇక రామ్ బర్త్ డే సందర్భంగా ఈ గురువారం ఈసినిమా టైటిల్ తోపాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ కానుంది.ఇప్పటికే రామ్ ఈ గ్లింప్స్ కి డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశాడు. ఈసినిమాపై రామ్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.రామ్ కి కూడా ఈసినిమా కీలకం కానుంది.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి శెట్టి ఫేమ్ మహేష్ బాబు తెరకెక్కిస్తున్న ఈసినిమాలో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అన్ని కుదిరితే ఈసినిమాను దసరా బరిలో నిలపాలని చూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: