తెలుగు చిత్రసీమలో విశిష్టమైన నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, దివంగత ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని ‘న్యూ టాలెంట్ రోర్స్ @’ బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే లాంచ్ చేసిన నందమూరి తారక రామారావు ఫస్ట్ దర్శన్ కి వరల్డ్ వైడ్ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ద్వారా ప్రతిభావంతులైన కూచిపూడి డ్యాన్సర్, తెలుగు అమ్మాయి వీణారావు కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా గ్రాండ్ ముహూర్తం షూట్ నిన్న హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ లో వైభవంగా జరిగింది. ప్రారంభోత్సవ వేడుకకు ఎన్టీఆర్ కుమార్తెలు శ్రీమతి గారపాటి లోకేశ్వరి, శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి, శ్రీమతి నారా భువనేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ.. “ఈ రోజును నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఎన్టీఆర్ గారి ఘాట్ నాకు పుణ్యక్షేత్రంతో సమానం. ఎన్టీఆర్ గారి అభిమానులకు ఇది ఒక శక్తిని ఇచ్చే స్థలం. ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందంగా ఉంది. తెలుగు జాతి ఉన్నంతవరకూ ఆయన ఉంటారు. ఆయన కుటుంబంలో నాలుగోతరానికి చెందిన వ్యక్తి.. ఆయన పేరు పెట్టుకున్న మనవడు ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్సవం ఈ ప్రదేశంలో జరగడం నాకెంతో ఆనందంగా ఉంది.”
“ఆయన పేరు పెట్టుకోవడం అంటే ఈజీ కాదు.. పేరు ఎవరైనా పెట్టుకుంటారు.. కానీ ఆ రంగంలో రాణించగలగాలి. ఈ కార్యక్రమం మా ఆరాధ్య దైవం ఎన్టీఆర్ గారి కుమార్తెల చేతులమీదగా జరగడం అద్భుతమైన అనుభూతి. ఇది ఒక మిసైల్ లాంచింగ్ లా అనిపించింది. ఇది మరపురాని ఘట్టం. తారక రామారావు సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తారక రామారావుకు కుటుంబసభ్యులందరి సపోర్ట్ ఉంది.”
“ముహూర్త షాట్ కి మోహన్ కృష్ణ గారు డిఓపిగా చేయడం మా అదృష్టం. రామకృష్ణ గారు నందమూరి అభిమానులకు ఒక ఆక్సిజన్ లాంటి వ్యక్తి. ఈ కార్యక్రమానికి నీకు నేను హరికృష్ణ లాగా ఉంటాను అని ఆయన చెప్పడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. తారక రామారావుకు అందరి అండదండలు ఉంటాయి. తను మంచి స్థాయికి ఎదగాలని ఒక నందమూరి వీర అభిమానిగా కోరుకుంటున్నాను. తెలుగు సాహిత్యం తెలుగు సంప్రదాయం హైందవ సంస్కృతి నేపధ్యంలో నా సాయశక్తుల కష్టపడి ఒక మంచి కథని తయారు చేశాను.”
“ఆ కథ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మేము కష్టపడి పనిచేస్తాం. మా కష్టాన్ని చూడండి. ఆశీర్వదించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నందమూరి కుటుంబ సభ్యులు, పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ కి చెందిన ప్రముఖులు, మీడియా మిత్రులు ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరి సహకారం మాకు కావాలని కోరుకుంటున్నాం. థాంక్యూ” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: