గత వారం విడుదలైన చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్నాయి. అందులో టాప్ హీరోయిన్ సమంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ నుండి వచ్చిన శుభం ఒకటి.పెద్ద సినిమాలు రాకపోవడం అలాగే ఐపీఎల్ మ్యాచ్ లు లేకపోవడంతో వీకెండ్ లో ఈసినిమా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది. మూడు రోజుల్లో శుభం ప్రపంచ వ్యాప్తంగా 5.30కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.దాంతో టార్గెట్ లో 80శాతం రికవరీ చేసింది.ఈవారం లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈసినిమాకు బాక్సాఫీస్ వద్ద సింగిల్ తో గట్టి పోటీ ఎదురవుతుంది.సింగిల్ కూడా శుభంతోనే రిలీజ్ కాగా పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకుంది. దాంతో సింగిల్ డామినేషన్ కొనసాగుతుంది.లేకపోతే శుభం కలెక్షన్స్ ను ఇంకా పెరిగేవి. ఇక అటు ఓవర్సీస్ లోనూ శుభం హిట్ దిశగా దూసుకుపోతుంది.ఇప్పటివరకు నార్త్ అమెరికాలో 150K మార్క్ ను క్రాస్ చేసింది. ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈసినిమాలో కామెడీ హైలైట్ అయ్యింది.
సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించిన ఈసినిమాలో సి. మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు.రిలీజ్ కు ముందు సమంత సినిమాను గట్టిగానే ప్రమోట్ చేసింది.మొత్తానికి నిర్మాత గా మొదటి సినిమాతోనే విజయాన్ని అందుకుంది సమంత.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: