రాజ్‌తరుణ్‌ హీరోగా తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం

Raj Tarun Kollywood Debut With Vijay Milton’s Telugu-Tamil Bilingual Movie

తెలుగులో ఉయ్యాల జంపాల చిత్రంతో కథానాయకుడిగా పరిచయమై తొలిచిత్రంతోనే విజయాన్ని అందుకుని ఆ తరువాత కుమారి 21ఎఫ్‌, సినిమా చూపిస్తా మామ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలతో అందర్ని అలరించిన కథానాయకుడు రాజ్‌తరుణ్‌. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని చూపెట్టే ఈ కథానాయకుడు తమిళంలో కూడా అడుగుపెడుతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నేడు రాజ్‌తరుణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నూతన చిత్రం విశేషాలను ప్రకటించారు. రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా తమిళ, తెలుగు, భాషల్లో ద్విభాషా చిత్రంగా ఏకకాలంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి తమిళ స్టార్ హీరోలు విక్రమ్‌, విజయ్‌ ఆంటోని, మరియు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్‌లు నటించిన చిత్రాలతో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న పాపులర్‌ సినిమాటోగ్రఫర్‌ అండ్‌ దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ రూపొందిస్తున్నారు.

అలాగే ‘గోలీసోడా, గోలీసోడా2, గోలీసోడా రైజింగ్‌, భైరాగి, కడుగు’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా తన దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంతో హీరో రాజ్‌ తరుణ్‌ను కోలీవుడ్‌కు హీరోగా పరిచయం చేస్తున్నాడు. కాగా తమిళంలో టాప్‌ హీరోలు విజయ్‌, అజిత్‌ వంటి హీరోలు నటించిన చిత్రాలతో పాటు సుమారుగా నలభై మూడుకి పైగా సుప్రసిద్ధ చిత్రాలకు సినిమాటోగ్రఫర్‌గా కూడా పనిచేశారు విజయ్‌ మిల్టన్‌.

‘గోలీసోడా’ ఫ్రాంఛైజీలో భాగంగా రాజ్‌తరుణ్‌తో ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించబోతున్నాడు. రఫ్‌నోట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మాణం కానుంది. ఇక ఈ చిత్రంలో రాజ్‌ తరుణ్‌ కంప్లీట్‌ న్యూ అవతార్‌లో ఆడియన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చే విధంగా పూర్తి వైవిధ్యమపాత్రలో కనిపించనున్నాడు.

న్యూ షేడ్‌ యాక్షన్‌ ప్యాక్‌డ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం ఓ విభిన్నమైన కథతో, స్ట్రాంగ్ స్క్రీన్‌ప్లేతో ఉండనుంది. ఈ చిత్రంలో కోలీవుడ్‌లోకి రాజ్‌ తరుణ్‌ ఎంట్రీ ఎంతో గ్రాండ్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంటుందని చెబుతున్నారు మేకర్స్‌. కాగా ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.